జీవము
23
దింపవచ్చును. సృష్టికర్తను సుగుణాడ్యుడైన మానవునిగా భావించినంతకాలం ఈ వాదాన్ని సమర్థింపలేము. కాని, మానవాధిక్యతను క్షణకాలం మరచినట్లైతే జీవోద్భవం కొరకే ఈసూత్రాలు నిర్మింపబడ్డాయనడానికి కించిదవకాశమైనలేదని గ్రహింపవచ్చును. సృష్టి రహస్యాలభేదించునప్పుడు జీవశాస్త్రం (Biology) కన్న పదార్థ విజ్ఞానమే ముఖ్యంగా కనిపిస్తూన్నందున అయస్కాంతత్వము రేడియోధార్మికతకొరకే ఈనియమాలను సృష్టికర్త ఎంచుకొన్నాడనవచ్చును. విశాలదృష్టితో చూచినప్పుడు విశ్వంలో జీవానికిగల ప్రాముఖ్యం స్వల్పాతిస్వల్పమని తెలియకతప్పదు ; అప్పుడు జీవం పట్ల సృష్టికర్త పక్షపాతం వహించేడనుకొనుట హాస్యాస్పదమని విశదమౌతుంది.
ఇంత విస్మయజనకంగా మనం జన్మించినట్లు విజ్ఞానం తెలియచేస్తూంది. ఇక, జీవోద్దేశమెరిగి, జీవకోటికి ముందెట్టి అవస్థ ప్రాప్తింపనున్నదో కనుగొనప్రయత్నించినప్పుడు భయమధికమౌతుంది. యధోచితమైన వేడివెలుగులు గల ప్రదేశాలందే మనజీవం వంటి జీవంజనించి వర్ధిల్లుతుంది. సూర్యునినుండి యుక్తమైనతేజోష్ణ ప్రసారాలు భూమిపై పడుతున్నాయి గనుక మనం జీవిస్తున్నాం. ఆ యుక్తపరిమాణం ఏమాత్రమిటునటు చలించినట్లైతే ధరనుండి జీవం అదృశ్యం కావలసిందే ! అట్టి మార్పు సులభనంభవమన్న విషయం విషాదకరం.
సూర్యుని ఆవరించుకొన్న సంకుచితమగు సమశీతోష్ణ మండలంలో తిరుగుతూన్నా భూమిపైనున్న మనకు మును ముందొక "హిమయుగం" (ice age) సంప్రాప్తించేటట్లుంది. సాగర