20
జగత్తు - జీవము
వ్యవచ్ఛేదం (chemical analysis) వల్ల తెలుస్తూంది. పెద్ద అణువులుగా నేర్పడు లక్షణం చాల పరమాణువులకు లేదు. ఆమ్లజని O2, O3 అణువులుగను, ఉదజని H2, H3 అణువులుగను. ఈ రెండును కలిసి H2 O (నీరు), H2 O2 గను ఏర్పడుతున్నాయి. వీటిలో ఏ అణువునందును నాలుగుకన్న ఎక్కువ పరమాణువులు లేవు. వీటికి నత్రజని (nitrogen) కలిపినను ఒక అణువువునందుండు పరమాణువులసంఖ్య అంతగా హెచ్చదు. కాని, అంగారాన్ని చేర్చినప్పుడు గొప్పమార్పు కలుగుతుంది ఆమ్లజని, ఉదజని, నత్రజని, అంగారముగల అణువులలో వందలు, వేలకొలది పరమాణువు లున్నాయి. ఇట్టి అణువులతోడనే ప్రధానంగా జీవరాశు లేర్పడుతున్నాయి. ఈఅణువులతో జీవశక్తి కలియుటచేత జీవమేర్పడిందని గత శతాబ్దం క్రిందటివరకు భావిస్తూండేవారు. కాని, తన పరిశోధనాగారంలో రసాయనిక సంయోగం (chemical synthesis) వలన యూరియా అను అల్పాచమానంలోనున్న ఒక పదార్థాన్ని వోయిలరు (Wholer) తయారుచేసేడు. అప్పటినుండి, శరీరసంబంధమైన మరికొన్ని పదార్థాలని తయారుచేయడానికి సాధ్యమయింది. కావున, జీవశక్తి కారణంగా సంభవిస్తూన్న వని భావింపబడిన కొన్ని