జీవము
19
అనగా కల్పనాధురీణుడగు విజ్ఞాని తన స్వాధీనంలో నున్న పరమాణువులతో జీవాన్ని సృష్టింపగలడా ? ఈప్రశ్నలకు సరియైన సమాధానం లేదు. అవి నిర్ణయించగలిగినట్లైతే జగత్తందలి యితర ప్రపంచాలలో జీవముందో లేదో ఊహించడానికి అవకాశముంటుంది. అప్పుడెట్టి భావ పరివర్తనం కలుగునో చెప్పలేం.
సామాన్య పరమాణువులతో జీవపదార్థాలు ఏర్పడుతూన్నను మిక్కిలి పెద్ద అణువులు [1] (Molecules) గా ఏర్పడు సామర్థ్యంగల పరమాణువులే వానియందు బహుళంగా నున్నాయని రాసాయనిక
- ↑ ఘన, ద్రవ, వాయురూపాలలోనున్న ద్రవ్యమంతా మూలపదార్థాల (Elements) తో ఏర్పడుతుంది. అట్టి మూలపదార్థాలు 92 కలవు. వాటిలోనివి కొన్ని ఆమ్లజని, బంగారం, రాగి, పాదరసం, వెండి. ఏమూలపదార్థాన్నైనా మన సామర్థ్యంకొద్ది తుత్తునియలు చేయగా పరమాణువుకన్న సూక్ష్మంగా ధాగింపలేము. ఒక మూలపదార్థంలోని పరమాణువులు మరియొకదాని పరమాణువులతో కలిసి అణువు లైనప్పుడు నూతనపదార్థమొకటి ఏర్పడుతుంది. ఆమ్లజనిపరమాణువులు ఉదజని పరమాణువులతో కలిసి నీటి అణువులౌతున్నాయి. జలాణువులు ఆమ్లజని, ఉదజని పరమాణువుల గుణాలుకాక పూర్తిగా క్రొత్తగుణాలను ప్రదర్శిస్తూన్నాయి. రెండు వాయువుల సంయోగంవల్ల ద్రవం జనిస్తూంది. సోడ్యము (Sodium) నీటిలోవేస్తే మండుతుంది : క్లోరీను (Clorine) విషవాయువు. కాని యీరెండిటి కలయికచే తినుబండారాలలో అత్యావశ్యకమైన ఉప్పు తయారౌతుంది.
పరమాణువు కేవలం అవిభాజ్యంకాదు. దానిలో విద్యుద్ఘటికలున్నాయి. అది నిర్మాణంలో సూర్యమండలాన్ని పోలింది. పరమాణువులో ఎన్ని ధన విద్యుత్కణాలైన ప్రోటాను (Proton) లు కలవో అన్ని ఋణవిద్యుత్కణాలైన ఎలక్ట్రాను (Electron) లు కూడ కలవు. ధనవిద్యుత్కణాలన్నీ సౌరమండల సూర్యునివలె కేంద్రం (Center) లో ఉంటాయి. ఎలక్ట్రానులలో కొన్ని కేంద్రాన్ని ఉండగా మిగిలినవి గ్రహాలవలె కక్ష్యలలో తిరుగుతూంటాయి. మూలపదార్థంయొక్క ద్రవ్య రాశి (Mass) ని ప్రోటానులసంఖ్య తెలియచేస్తుంది. దానినే "పరమాణుభారం" (Atomic weight) అంటారు. కక్ష్యలలో భ్రమించు ఎలక్ట్రానులసంఖ్యపై ఆపదర్ధంయొక్కగుణాలు ఆధారపడిఉన్నాయి. ఆసంఖ్యనే "పరమాణుక్రమాంకం" (Atomic number) అంటారు. ఆమ్లజని పరమాణువులో 16 ప్రోటాన్లు. 8 ఎలక్ట్రాన్లు కలిసి కేంద్రబీజం కాగా మిగిలిన 8 ఎలక్ట్రాన్లు కక్ష్యలలో తిరుగుతున్నాయి. కావున దానిపరమాణుభారం 16. పరమాణుక్రమాంకం 8. ఇట్లే, బంగారు పరమాణుభారం 197. పరమాణుక్రమాంకం 79 అన్నప్పుడు, బంగారు పరమాణువులో 197 ప్రోటానులున్నాయని 79 ఎలక్ట్రానులు కక్ష్యలలో తిరుగుచుండగా మిగిలిన 118 (197-79) కేంద్రబీజంలో ఉన్నాయని తెలుస్తుంది.