18
జగత్తు - జీవము
దీనియందైన జీవోద్భవం మిక్కిలి అపురూపమే. మన సూర్యుని వలె యితర సూర్యులు గ్రహాలని విరజిమ్ముట అసాధారణం అవుట చేత లక్షనక్షత్రాలలో ఒక్కటైన జీవోత్పాదకమండలంలో భ్రమణ మొనర్చు గ్రహాన్ని బడయుట కష్టమౌతుంది.
కావున మనజీవంవంటి జీవానికి తావిచ్చుటకే ప్రధానంగా విశ్వముద్దేశింపబడ్డదను విషయం అవిశ్వసనీయం. అట్లేయైనచో విశ్వంలోగల ద్రవ్యపరిమాణానికి తత్ఫలపరిమాణానికి గల పరస్పర సంబంధం యుక్తంగా ఉండెడిది.
అనుగుణమైన భౌతికావస్థలు తమంత తాము జీవోత్పత్తికి చాలునో చాలవో మనకు తెలియదు. క్రమక్రమంగా భూమి చల్లారిన కొలది సహజంగానేకాక అనివార్యంగా జీవం ఉద్భవించిందని ఒక పక్షంవారి అభిప్రాయం. ఒక ప్రమాదవశాన్న విశ్వంలో భూమి జన్మించినపిదప, భూమి పై జీవముద్భవించడానికి మరియొక ప్రమాదం అత్యావశ్యకమైనదని వేరొక పక్షంవారి ఉద్దేశం. అంగారం (Carbon), జలంలోగల ఆమ్లజని (Oxygen), ఉదజని (Hydrogen) గాలియందధికంగానున్న నత్రజని (Nitrogen) మొదలగు సామాన్య రాసాయనికపరమాణువులే (atoms) ప్రతి జీవపదార్ధంలోను గోచరిస్తూన్నాయి. జీవమేర్పడ్డానికి కావలసిన నానావిధ పరిమాణువు లన్నీ భూమి జన్మించినదాదిగా దానియందుండి యుండును.; ఈపరమాణుసముదాయం "జీవకణం" (Living cell) లో ఉన్న విధంగా ఒకప్పుడు కూడి ఉండవచ్చును. అయిననూ, వివిధపరమాణువుల అసాధారణ సంసర్గంతోనే జీవం ఏర్పడిందా, లేక, యీ అసాధారణ సంసర్గానికి "జీవశక్తి" (Vital Force) తోడపడటంచేత జీవకణం ఏర్పడిందా ?