పుట:Jagattu-Jiivamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవము

17

వచ్చును. ఈ అగ్ని గోళాలకు అతిదూరాన దురూహ్యమై అత్యధిక శీతలాధికతగల చలిన్ని, వాటికతిసమీపంగా ఘనపదార్ధాలని కరగించి మరగించు వేలకొలది అంశాల ఉష్ణోగ్రతగల వేడిమిన్ని గలవు.

ఇట్టి ప్రతివహ్ని గోళానికి నిశ్చితదూరాన ఉండి, దాని నావరించుకొన్న సమశీతోష్ణమండలం (temperate zone) లోనే మన మెరిగిన జీవంవంటి జీవం మనగలదు. చిత్రం 1 లో "అ" అగ్ని గోళం. "క గ చ", "జ ట డ" వృత్తాలకు నడుమన్నున్న ప్రదేశమే సమశీతోష్ణమండలం. ఈ మండ లోపరిప్రదేశమైన "ప బ మ"లో జీవం గడ్డవారుతుంది ; మండలాంతరమైన "త ద న" లో జీవం దహించుకొనిపోతుంది. జీవానికనుకూలమైన యిట్టి మండలాల మొత్తం ఆకాశంలో శతకోటి సహశ్రాంశంకన్న అత్యల్పంగాఉంది.