ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16
జగత్తు - జీవము
నక్షత్ర గ్రహకూటాలలో గ్రహకూటాలే ముఖ్యమైనవి. భూమిపై నున్న జీవంవంటి జీవం భూమివంటి గ్రహాలందే ఉత్పత్తికాగలదని ప్రకృతజ్ఞానం సూచిస్తూంది. అట్టి గ్రహాలలోనైన జీవోత్పత్తికి యుక్తమగు భౌతికస్థితులు (Physical conditions) మొదట సమకూడాలి ; ద్రవ్యం ద్రవరూపంలో నుండగల యుక్తతాపక్రమం ప్రధానం. దుర్భరోష్ణప్రసక్తములైన నక్షత్రాలు జీవోత్పాతకములు కానేరవు. పరమశూన్యం (absolute zero) కంటె 4 అంశాలు (degrees) హెచ్చు తాపక్రమం - అనగా ఫారన్‌హైట్ మానం [1] పై సుమారు 484 అంశాల శీతలాధికత || - గల ప్రదేశాలకును, అంతకెక్కుడు శీతలాధికతకలిగి దుగ్ధపధా (Milky way) నికి ఆవలనున్న అత్యంత విస్తీర్ణప్రదేశాలకును, ఒకింత ఉష్ణమొనగూర్చు తారావళిని ఆకాశవిక్షిప్త విస్తారాగ్ని సముదాయాలుగా భావింప
- ↑ తాపక్రమాన్ని కొలవడాని కుపయోగించు ఉపకరణాన్ని "తాపక్రమాపక" (Thermometer) మంటారు. నీటిని ఘనీభవించి మంచుగచేయు తాపక్రమం "హిమస్థానం" (Freezing Point) అను ఒక ప్రధానస్థానంగను, నీరు మరగి ఆవిరికాగల తాపక్రమం "తప్తస్థానం" (Boiling Point) అను రెండవ ప్రధాన స్థానంగను తీసుకొని యీరెండిటి మధ్యనున్న అంతరాన్ని సమానభాగాలు చేసేరు. ఈ భాగాలనే అంశములంటారు. సెంటిగ్రేడు, రూమరు, ఫారన్‌హైటు అను మూడు మానాలుకలవు. పై అంతరాన్ని సెంటిగ్రేడు, రూమరుమానాలలో క్రమంగా 100.80 అంశాలుచేసి, హిమస్థానాన్ని "0" (సున్న) అని, తప్తస్థానాన్ని "100". "80" అని వరుసగా గుర్తించేరు. ఫారన్‌హైటు మానంలో హిమస్థానంవద్ద "32" న్నూ, తప్తస్థానంవద్ద "212" న్నూ గుర్తించి అంతరాన్ని 180 అంశాలుచేసేరు. ఒకే అంతరాన్ని వివిధభాగాలు చేయడంచేత 100 సెం. = 80 రూ. = (212-32) లేక 180 ఫా. రోగార్తులకు జ్వరం కనుగోడానికి సామాన్యంగా ఫారన్‌హైటు మానంగల తాపక్ర మాపకం వాడుకలోనుంది. ||ఋణసంజ్ఞకల మానానికి "శీతలాధికత" అని వాడబడింది.