14
జగత్తు - జీవము
ఆ తార సూర్యుని సమీపిస్తున్నంతకాలము ఆ ప్రళయతరంగము వృద్ధియగుచునే ఉండవలెను ఇట్లు క్రమక్రమంగా సూర్యసమీపానికి వస్తూన్న నక్షత్రం తిరుగుమోమయేసరికి పరస్పరాకర్షణశక్తి మితి మీరి ప్రళయశక్తియౌటచే, అపరిమితాకృతినున్న సూర్యదవ్యం చిందరవందరై సముద్రతరంగ ఫేనమట్లు ఆశకలాలని చిమ్మి ఉండవలెను. తార తనదారినిపోగా దానినాశ్రయించి వెన్నాడలేని ద్రవ్య ఖండాలు సూర్యునికి దూరంగానుండి, గ్రహాలై, సూర్యునిచుట్టూ నిత్యప్రదక్షణాలు చేస్తున్నాయి. వాటిలో మనభూమి ఒకటి.
సూర్యుడు, నక్షత్రాలు మిక్కిలి వేడిగానున్న అగ్ని గోళాలు. మనభూమిపై నున్న జీవంవంటి జీవం పుట్టడానికికాని పెరగడానికికాని వీలులేనంత తాపక్రమం (Temperature) కలిగి ఉన్నాయి. రవి నుండి పై కెగసిన గ్రహాలు ప్రారంభదశలో అత్యధిక తాపక్రమం గలవే ; కాని క్రమంగా అవి చల్లబారి, అంతరుష్ణాన్ని కోలుపోయి, యిప్పుడు వేడిమికై సూర్యోష్ణప్రసారంపై ఆధారపడ్డాయి. కాల క్రమాన్న, పునరుత్పత్తి మరణాలు తప్ప వేరొక కార్యనిర్వహణానికి సామర్ధ్యంలేని చిన్న క్రిమికీటకాది రూపంలో భూమియందు జీవం ప్రారంభమైంది. నిరాడంబరమగు యిట్టి ప్రారంభదశనుండి వెలువడిన జీవవాహిని మహత్తర క్లిష్టపరిస్థితుల దగిలి పెంపొంది, రస బంధురములై, వాంఛాసముంచితములై, మాధురీధురీణములై, అధ్యాత్మిక చింతానికేతనాయతమతమ్ములు వర్తిల్లు జీవులకు తావలమై పరిణమించింది.
సూక్ష్మవాలుకాకణప్రాయమగు భూమిపై నివసించు మనం కాలాకాశ సంచరిత వసుధను కుక్షియందిడుకొన్న జగత్తుయొక్క యాధార్ధ్యప్రయోజనాలను విమర్శింప పూనుకొంటున్నాం. కాలమంటే