పుట:Jagattu-Jiivamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవము

13

తారక లీజగత్తులో గలవనవచ్చును. విశాలాకాశంలోని వీనిద్రవ్యము (Matter) తో సరిచూచిన మనభూమి ఎంత అల్పమో ఊహింప వచ్చు.

ఆకాశసంచారం చేస్తూన్న తారాకావళిలో కొన్ని కృత్తిక, మృగశిరవలె గణముగా ఏర్పడి పరస్పరసాహాయ్యమున చరిస్తున్నాయి ; సంఖ్యాధికము నిస్సంగపాంథ సందోహమువలె పరిభ్రమిస్తూంది. ఈ అనంతవిశ్వమందు తిరుగుచుండుటచేత ఒక నక్షత్రము ఇంకొకనక్షత్ర ప్రాంతానికైన వచ్చుట బహుదుర్లభము. ఆకాశంలో ఏకాకియై గమించు ఒక్కొక్కతార అపారసముద్రంలో ఒంటరిగా ప్రయాణించు ఓడవలెవుంది. విశ్వార్ణవమున యాత్ర సాగించు తారకానౌకలలో చాల దగ్గరగానున్న ఏరెండింటికై నను నడుమ దశలక్ష యోజనములుండుటచేత పరస్పరంగా అవి కనుచూపు మేరకు వచ్చుటే కష్టము.

కాని కొన్ని మహార్బుదములకు పూర్వము ఒక అపూర్వ విషయము సంభవించినదని కొందరు విజ్ఞానుల అభిప్రాయము. ఒక బృహత్తర ఆకాశంలో తనదారినదిపోతూ సూర్యుని కనుచూపు మేరకు వచ్చుట తటస్థించింది. మన సముద్రాలలో సూర్యచంద్రు లేవిధంగా కెరటాలుద్భవింపజేస్తున్నారో అట్లే ఈ తారగూడ పరస్పరాకర్షణశక్తిమూలంగా సూర్యద్రవ్యాన్ని కలచి తరంగాలని కల్పించి ఉండవలెను. స్వల్పరాశియగు చంద్రునిచే కలుగు చిన్న కెరటాలవలెగాక, అవి అత్యద్భుతంగానుండి ఉండవలెను. ఆతార సూర్యుని సమీపిస్తుండగా పరస్పరాకర్షణశక్తి అధికమవుచూ ఆ తరంగాలనుండి ఒకటి ప్రళయతరంగ (Tidal wave) మై, సూర్యోపరిభాగాన్ని క్రమ్మి అపరిమితాకృతిని దాల్చి ఉండవచ్చును.