10
జగత్తు - జీవము
పరమాణువులు అవ్యక్తంగా ఉంటాయి. సూర్యగోళమంత గోళంలో మానవుడవ్యక్తంగా ఉన్నట్లు. ఒక తులాన్ని కోటిభాగాలుచేసి, అందులో ఒకభాగాన్ని కోటిభాగాలుగాచేసి, అందులో ఒకభాగాన్ని తిరిగి కోటిభాగాలుచేయగా అందులో ఒకభాగంలో శతసహస్రాంశం కన్న స్వల్పంగా ఉంటుంది ఉదజని పరమాణువుయొక్క భారం. చిన్న నీటిబిందువులో కోటానకోట్ల జలాణువులుంటాయి.
ఇంత సూక్ష్మతమమైన పరమాణువు సూర్యమండలంవలె నిర్మితమైఉంది. యావత్పరమాణువు అంతరాళపూరితమై ఉంది. పరమాణువుయొక్క వ్యాసం అంగుళంలో సహస్రాంశంలో శత సహస్రాంశం. సూర్యసన్నిభంగా పరమాణువు మధ్యనున్న కేంద్రకంయొక్క వ్యాసం పరమాణువ్యాసంలో శతసహశ్రాంశమై ఉంది. అంతరాళం అంతర్ధానమయేటట్లు ఎలక్ట్రానులను, పరమాణువులను అణువులను దగ్గరగా కుద్దించగలిగితే ఎంత దివ్యభవనమైనా అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. అట్లుండబట్టేకాబోలు శ్వేతవామనతార (White dwarf) ఒక విధమైన నక్షత్రం-లలోని ద్రవ్యసాంద్రత ఘనపుటంగుళానికి సుమారొక టన్నుపైబడిఉంది. పరమాణువులోని ఎలక్ట్రానులు కేంద్రకంచుట్టు విరామంలేకుండా పరిభ్రమిస్తున్నాయి.
ఎలక్ట్రానంత విద్యుదావేశ (electric charge) మే గల ప్రోటాను ఎలక్ట్రానుకన్న 1850 రెట్లు బరువైన విద్యుత్కణం. ఘనపరిమాణంలో ప్రోటానుకన్న ఎలక్ట్రానే పెద్దది.
ఇది సూక్ష్మజగత్తుయొక్క చిత్రం.
రేడియో ధార్మికత్వం, x - కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, విద్యుత్తు, ఛాయాగ్రహణము మొదలగు సాధనాలతో,