Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగత్తు

9

నిర్లక్ష్యంగా దుర్వ్యయమొనర్పబడిన అపరిమితశక్తి శూన్యాకాశ కుహరాలలో వ్యాపించగా, దుర్బలమైన ద్రవ్యం గడ్డకట్టి, నిరంతర నిశ్చలావస్థలో మూర్తీభవించిన జడత్వమట్లుండిపోతుందా ? ఔననడానికిగాని, కాదనడానికిగాని తగిన ఆధారాలులేవు.

విశ్వం క్షీణించవలసిందే అని కొందరు విజ్ఞానులంటారు. విశ్వంఅనే గడియారానికి ఆదినెవరో ""కీ" ఇచ్చేరు. కాలక్రమాన్ని "కీ" తగ్గిపోతుంది, తిరిగి "కీ" ఇచ్చేవారులేరు. సర్వనాశనమై పోయేవరకు ద్రవ్యం శక్తిని ప్రసరిస్తుంది ; ఈ శక్తి యావత్తు ఆకాశంలో చెదరిపోతుందే కాని తిరిగి ద్రవ్యంగా పరిణమించ లేదంటారు.

శక్తి ద్రవ్యంగా పరిణమించలేదని ప్రాయోగికంగా ఋజువైతే అగుగాక, అది మన పరిశోధనాగారాలలోనే. అంతమాత్రాన ఈవాదం సత్యమనలేము. జగత్తను ఈబృహత్తమ పరిశోధనా గారంలో అత్యద్భుతప్రయోగాలు నిరంతరం జరుగుతున్నాయి. వాటినవగాహన చేసికొనడానికి మానవబుద్ధి చాలదు. ఇంకా వికసించాలి. ఆకాశగర్భంలో శక్తి ద్రవ్యంగా పరిణమించలేదనడం సాహసమే.

తీవ్రపరిశోధనమూలంగా మనకుప్రాప్తించిన జ్ఞానమేమనగా : ఆకాశంలో నెబ్యులాలు సాంద్రీకరించడం, నెబ్యులాలలో నక్షత్రగోళాలేర్పడడం, నక్షత్రాలప్పుడప్పుడు తునియలై గ్రహాలుద్బవించడం మొదలైనవి విశ్వపరిణామఫలితాలు. వాటికి నిదర్శనాలు ఎన్నైనా ఆకాశం చూపిస్తుంది.

ఇక సూక్ష్మతమమైన జగత్తులు. అణు (molecule) వొక జగత్తని ఆధునికవిజ్ఞానం తెలియచేస్తూంది. అందులో పరిమాణువు (atom) లు నిత్యపరిణామ మొందుతున్నాయి. కొన్ని అణువులలోని