Jump to content

పుట:Jagattu-Jiivamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగత్తు

7

13000 కాంతి సంవత్సరాలు వ్యాసంగల నెబ్యులాని ఒక బిస్కట్టు నిరూపిస్తుంది, ఈపరిమాణంలో నిరూపింపబడిన భూమి కంటికి కనిపించదుసరికదా, దాన్ని కొన్నికోట్లసార్లు పెంచుతేనేగాని సూక్ష్మదర్శినిలో కనిపించు సూక్ష్మతమమైన కణంపాటి పరిమాణానికైనా రాదు.

ఇది మన జగత్తుయొక్క స్థూలచిత్రం. సౌరజగత్తు గెలాక్సీ జగత్తులో సూక్ష్మకణప్రాయంగా అంతర్బూతమై ఉంది. మన గెలాక్సీజగత్తుకి ఉపరి సర్పిలనెబ్యులాలతో ఏర్పడిన మూడవ జగత్తుంది. వీటిని తృణీకరించు జగత్తులు ఆకాశగర్భంలో ఎన్నో ఉండవచ్చును. ఇవన్నీ విశ్వంలోనివే !

ఊహాతీతమైన పరిమాణంగలవిగా ఈ జగత్తులు మనకగుపించవచ్చును. మనుష్యప్రమాణంతోటి, భూప్రమాణంతోటి కొలిచినప్పుడట్లేఉంటుంది ఆకాశసామ్రాజ్యంలో మనకెట్టి ప్రాముఖ్యం లేదన్నవిషయం మనకు సహజంగా గుర్తుండదు. యదార్ధానికి విశ్వంలో పరమప్రమాణంలేదు. సాపేక్షవాదం ఇక్కడ స్ఫురిస్తుంది. ఎలక్ట్రానుపై పుట్టిన జీవికి పరమాణువులోని శూన్యాంతరాళాలే దురూహ్యమైన బృహత్పరిమాణం గలవిగా గోచరిస్తాయి. గెలాక్సీలో జీవులుంటే వారికీ సౌరజగత్తు అతి క్షుద్రంగా కనిపిస్తుంది.

అయితే, విశ్వం అనంతమా ? విశ్వాన్ని ఒక గోళంగా భావించుకోమన్నారు. అప్పుడది నియతము (finite), అనావృతము (unbounded) అవుతుంది. అప్పుడు ఆకాశం వక్రమౌతుంది. ఆకాశంలో సూటిగా పోగాపోగా ఆకాశవక్రతచేత బయలుదేరిన స్థానానికే రావలసిఉంటుంది, భూమినిచుట్టివచ్చినట్లు. ఈ విషయమై