జగత్తు
5
మృతనక్షత్రం కేవలం "మృతం" అని భావింపకూడదు. జగత్తులో మృత్యువుకి స్థానంలేదు. మన కింద్రియగోచారంగాని వేరొక శక్తిరూపంధరించి ఈమృతనక్షత్రాలలో జగచ్ఛక్తులుండవచ్చును. కాంతి విహీనములైన ఆగోళాలలో నూతన వికాసంతో జీవం వర్ధిల్లుచుండవచ్చును. ఆజీవం భూలోకజీవంవంటి జీవం మాత్రంకాదు. ఆజీవాన్ని మనంగుర్తించి హెచ్చరింపలేము. సౌరమండలంలోని ఇతరగ్రహాలలో జీవం నేటికిని కనుపించలేదంటే, నక్షత్రలోకాలలో జీవం మనలేదని సిద్ధాంతీకరించలేము. సౌరమండల నియమాలు నక్షత్రమండలాలకు వర్తించకపోవచ్చును. కాంతి సాగరప్రసృత నీలనెబ్యులాలు నక్షత్రమండల సూత్రానుగుణ్యంగా జీవరాశులతో కలకల లాడుచుండవచ్చును.
సుమారు 10 లక్షలకాంతి సంవత్సరా [1] లమేర దిక్తటములు దృష్టి సారించగలిగిన యంత్రాలైనా జగద్విషయమై మనకెరింగించినది అతి స్వల్పం. అతిదూరంగానున్న నక్షత్రంలో అత్యధికదృష్టి సామర్థ్యంగల దూరదర్శినినిపెట్టి అక్కడనుండి విశ్వాంతరాళం శోధిస్తే అక్షయంగా నక్షత్రాలు బయల్పడతాయి. నక్షత్రంనుండి నక్షత్రాని కీయంత్రంతోపోయి ఆకాశం చూచినకొద్దీ అంతంలేని కాలాంతంవరకు నక్షత్రగణాలు గోచరిస్తూనే ఉంటాయి. ఏమంటే, దగ్గరగానున్న నక్షత్రాలైనా తేజోవంతమైనవికాకపోతే కనుపించుట కష్టం. మహాతేజోవంతమైన నక్షత్రాలు అతిదూరంగా ఉంటే దీర్ఘ
- ↑ కాంతి సంవత్సరమంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణంచేయుదూరం, సెకెనుకి 186,000 మైళ్ల చొ॥ సంవత్సరానికి 186000X60X60X24X365= 5897,000,000,000 లేక సుమారుగా 6 లక్షలకోట్ల మైళ్లదూరం పోతుంది. 6 లక్షల కోట్ల మైళ్లు దూరంలోనున్న నక్షత్రం ఒకకాంతి వత్సరదూరంలోనుందని అంటారు.