పుట:Jadakucchulu1925.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

జడకుచ్చులు

గీ. ప్రణయ గాధయొ? దారుణ రణకథా క
   ధనమొ? లేక సందేశ గాయనకళా క
   లాపమో! తేటఁబడదు. నీ లలితగీతి
   చంచలతనూగు మర్త్య ప్రపంచమగుట.

గీ. పలుతెఱంగు, లనేక భావములు, భిన్న
    రుచులు, కలయునికళలు రేగుచుఁ జలించు
    విశ్వమిదె విశ్రమించి నీ విమలబోధ
    వినియెడిని తదర్థ మెఱింగికొ నెడునాస్థ.

గీ. పవలుఱేలును నాక మవ్వంపు జెలుల
    కౌఁగిళులఁ జొక్కి సోలెడు కాముకులకు
    బోధపడదెంతయును నీదు మోహనోక్తి
    సొలపులనుమాన్ప కలజడిఁ గొలుపుగాని,

గీ. తర్కముల బోధగాక, సూత్రముల విడక
    భాష్యమీమాంసములఁ దేటపడని, తాత్వి
    కులరహస్యము లెటు తీర్పఁగలవొ పికమ!
    ఆలకింపనున్నారు వేదాంతు లదిగొ!

గీ. "కో" యనెడు నీదు మేల్కొల్పు హాయి కలరి
    యెలుఁగులిచ్చు పుల్గుల కలకలమువినెదొ!
    స్వకుల సందేశమని వాదుసలిపి, యన్వ
    యించునీగీతి నెటు సమర్థించుకొందు?