పుట:Jadakucchulu1925.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవరు ?

65


    ఆనంద సూత్రము లో భామా!
         అల్లు తెల్లనిబైట నోభామా!
    నాయటపట్టులె యో భామా!
         ననుపున్న రమ్మట కోభామా!

                 

V



గీ. అతఁడు వలచినప్రేయసి యన్యయనుచు
   నేనువలచిన వన్నెలా డితరుఁడనుచు
   వేఱువేఱైతి మంత ట, చారుజలద
   గర్భమునువదలిన జలకణములట్లు

గీ. ప్రేమపుష్పమ్మపైఁ గాంక్షఁబెట్టి మనసు
   లుత్కటమ్మగు విరహాన నుడికి కమలఁ
   జీలిపోతిమి త్రోవలఁ జిరవిలీన
   మధురమైత్రి శరన్మేఘమాల గాఁగ

గీ. అందమైనచందములఁ బ్రియమ్ములయిన
   యాటపాటల భక్తిలీలానురతుల,
   ప్రియుని సుఖశోభనమ్ముఁ గోరితిని నేను
   సరససుమములఁ బ్రియుఁబొందు చైత్రిచాయ

గీ. కర్కశములగు నియతులఁ గష్టమయిన
   జపతపంబుల, నిష్ఠాప్రచారగతుల,
   ప్రియసమాగమపుణ్య మర్థించె నతఁడు
   భీష్మతపన రోహిణిఁబొందు గ్రీష్మునట్లు,