పుట:Jadakucchulu1925.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

జడకుచ్చులు


కాటుక రెప్పలు ఓభామా!
         కబళింపనీవుంటివో భామా!
మీటిన కిన్నెర ఓభామా!
         పాటనాపఁగలేదు ఓభామా!

ఏ బంగరుకల లోభామా!
         నీవుంటివోయప్పుడోభామా!
కనురెప్పలైనను ఓభామా!
         కదలలేదేయప్పు డోభామా!

బొటన వ్రేలయినను ఓ భామా !
         చిటు కనలేదప్పు డోభామా!
ఆపరవశదశ లో భామా!
         యదలింపరాదని యోభామా!

అడుగుకదలకుండ నోభామా!!
         ఆవలవచ్చితి నోభామా
నీప్రేమయారాట మోభామా!!
         నీకొప్పగించితి నోభామా!

సందెరంగులబూయు నోభామా!
        యందపువాకిండ్ల నోభామా!
స్వరమధుధారలు ఓభామా!!
        జల్లులాఱనిచోట నోభామా!