పుట:Jadakucchulu1925.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

జడ కుచ్చులు

చిత్తరువులతో రాణించు చెలువుదోఁచె
ఎచటివా రచ్చటనె చలియింప కుంట.

వీధి వీధులఁ బోరలె నాబిడ విలాస
రాగలాలిత గానతరంగ భరము
తెలి తమలపాకు తీవ పాదులకుం బాఱు
ధవళజలకుల్య భాతి నార్ద్రంపుగతుల.

ఆమె పాడిన పాటల నాలకించి
అందుముకుళించియున్న భావార్థమొంచి
ఒక విధంబైన యున్మాదచకితదశల
కగ్గమైతి మే మిరుపుర మద్భుతముగ.

IV పాట.


వున్నమ జూబిలి! ఓ భామా!
పూచిన సుఖ రాత్రి నోభామా!
నెవ్వగతారలు! ఓభామా!
నిదురఁబోనని వేళ నోభామా!

పవసునీలాలన కోభామా!
పువులు వేచెడి సందె నోభామా!
మొగలిపూరేకులు ఓ భామా!
మొగము లెత్తెడి వేళ నోభామా!