పుట:Jadakucchulu1925.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధుమాలి

కసమ్మనఁ బూవులేయందగించె
వసుధకడుపునఁ బూవులే పవ్వళించె,
ఆలయమ్మునఁ బూవులే యాటలాడె,
ఏలపాడదు తుమ్మెద ఫూలపాట. 1

పవను కౌఁగిటఁ బూవులే సవదరించె
హృదయమందునఁ బూవులే రేకులెత్తె;
తోటలోపలఁ బూవులే తొలకరించె,
ఏలపాడదు తుమ్మెద పూలపాట. 2

ఎన్నియెన్నిభవంబుల నేమియేమి
పూజలను జేసి పట్టితీ పూలనోము !
చైత్రు సహవాససుఖము లేచాయ నబ్బె
తేట సేయుము తుమ్మెదా ! పాటఁ బాడి. 3

కష్టములను శారదచంద్రికలవిధాన,
దుఃఖములను తొల్కరివానతుసుక లట్టు,
లనుభవించిత,----చిత్త మాహ్లాదపులక
వివశమయి సేయు నృత్యమున్ విడువకుండ. 4

స్తన్యభరశీతలం బైన జననియొడిని,
పరిమళప్రగాఢమగు భామపాన్పునందు

38