పుట:Jadakucchulu1925.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూవు

31

 రెక్కల గందాలు ♦ గ్రక్కేటి పూన
మోమున లావణ్య ♦ ములు రాలు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజ కో పూవ!

5


పసుపు కేసరముల ♦ మిసిమించు పూవ
నిగనిగ సొగసుల ♦ బిగిపోని పూవ
పెండ్లిండ్లు పాలించు ♦ ప్రేమంపు పూవ
వీరుని కంఠాన ♦ విప్పారు పూవ
పోవటే! మాతల్లి♦ పూజకో పూవ!

6


కావుకన్నియ కొప్పు ♦ గైసేయు పూవ
ఉపవనాల నుయాల♦ లూగేటి పూవ
తోటకంచెల వన్నె ♦ తోబూచు పూవ
అడవిదొంకల నంద ♦ మయి యొప్పు పూవ
పోపటికి మాతల్లి ♦ పూజ పూప..

7


సెలయేటి పాటకు ♦ జేవియొగ్గు పూవ
తుమ్మెద సఖులతో ♦ త్రుళ్ళేటి పూవ
సైరగాలికి విచ్చీ ♦ వర్థిల్లు పూవ
రంగుల రాశివై ♦ రాణించు పూవ
పోవబే! మాతల్లి ♦ పూజ కో పూవ!