పుట:Jadakucchulu1925.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూలు


1


చెలియుల సీగలలో ♦ జెలు వారు పూవ
పడతుల జడల పై ♦ బపళింగు పూవ
సఖుల ముచ్చట ముళ్ళ ♦ సవరించు పూవ
లలనావతంసమ్ము ♦ లను గుల్కు పూవ
సోవటే! మాతల్లి ♦ పూజ కోవూవ!

2


అఱ విచ్చి సిగ్గుల ♦ గరంగేటి పూవ
మొగ్గపై మోజుల ♦ మొలిపించు పూవ
పూచి శోభనముల ♦ బొదివిన పూవ
దళముల కౌగిలిం ♦ తలఁజొక్కు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజ కోపూవ!

3


చిగురాకు మనుఁగునం♦ జెలువారు పూవ
తొమ్ముల సందిళ్ళ ♦ గొన లెత్తు పూవ
ఎండకు కాగని ♦ యెల పూత పూవ
వెన్నల 'పేరని ♦ వెలుతురు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజ కోపూవ!

4


కడుపులో తేనెలు ♦ కల కన్నె పూవ
తనువున గంధాలు ♦ దయివారు పూవ

3౦