పుట:Jadakucchulu1925.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేషచైత్రము



ఇరుగు పుట్టిండ్లలో ♦ నెదిగిన యెలమి
కొమ్మల యొడులలో ♦ గులికిన కలిమి
మృదువనస్పతులలో ♦ ములగిన చెలిమి
వైశాఖమును జూచి ♦ వదలదే చైత్ర!
                 2
పూల కొగిండ్లలో ♦ నోలలాడితివి
సరసుల పొత్తులో ♦ సఖ్య మాడితివి
పసిపైరగాలిలో ♦ పరువు లాడితివి
మండుటెండల నివి ♦ మానె దే చైత్ర!
                3
రమణుల చరణాల♦ రాచిన లాక్ష ,
అబలల యధరాల ♦ నంటిన తమ్మ,
కన్నెల నుదురుల ♦ కందిన చాదు
ఎన్నాళ్ళ మురిపెమో ♦ యెఱుఁగుదే చైత్ర !
                4
కోయిల పాటలోఁ ♦ గోమల స్వరము
మలయమారుతములో ♦ మధుర వాసనలు
కలికి పూగుత్తిలోఁ ♦ గమ్మని మధువు
అనుభవిం తెందాక ♦ నందాల చైత్ర!

28