పుట:Jadakucchulu1925.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

జడకుచ్చులు



            17
సుఖనిశీధము, గీతికాముఖరపథము,
సరసపవనము, సుమదళ చకితవనము ,
పెనఁగి నిలువంగనీయవు మనసులోని
ప్రియగతులఁ గంఠ ముఖమునఁ బెకలకుండ !
            18
చచ్చిపోవు కారాకుల స్థానములను
చిగురుచేవలు మొలుచు సౌష్ఠవముగనుచు,
మృత్యువునకేలో భీతివహింత్రు, జనులు
అవల స్వచ్ఛందసౌందర్య మబ్బుచుండ.
<poem>