పుట:Jadakucchulu1925.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వసంతవికాసము



               1

రుణ కుసుమశిఖా సూత్రధారిపగుచు

ముదురు లేఁతల భేదము లొదవనీక
నిఖల తరుజగతికిని నందించినావు
సహృదయానంద రాగ రంజనము చైత్ర:

               2
కలికికోయిల గొంతులో మొలక గీతి,
సోయగపుఁ బూల పొత్తులఁ దీయ తేనె,
పోసితో యెప్పు డప్పుడే పులకరించె
నాహృదయశయ్య కవితోపగూహనమున.

               3
కొమ్మ కొమ్మన, నాకు నామున నలంది,
పూవు పూవునఁ, జివురు చివురునఁ జిందఁ
జిలికితివి నూత్నచైత్ర కాశ్మీరరుచులు
పుడమి నవకమ్మనకు వన్నె లిడ వసంత !

               4
మోళ్ళుమోసెత్త నిల మూలమూలలందు
నందమెగఁబోయు చైత్రుని దూగడముల
కీడ్వఁబడి మేలిముసు గింత యెత్తె గిగిన
భామ, తనకన్నెతపసెల్ల భంగపడఁగ,

22