పుట:Jadakucchulu1925.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర మాత

గీ.పాడయి శిలావశిష్టమై ♦ ప్రాప్తకాల
మనుభవించుచు, నుండి యు ♦ నక్కటకట !
బ్రతికి చెడ్డయాంద్రుల పూర్వ ♦ వైభవంబు
చాటెడిని నాలకింవుడు ♦ శాంతమతులు !

మ. కలదాంద్రోద్యమ వల్లికా కుసుమ రేఖామాలికా కాంతి తుం
దిల శోభాంశురపుంజుల్ భరతమా♦ తృ పిత్ప్ఫీత చూడామణీ
కలితచ్ఛాయల నందగింపఁగల భాగ్యంబిక, నీసాంగమం
గళక ళ్యాణముఁ శూడఁబుత్రి కలె వేడ్కన్ వత్తురా నాఁటికి •

శా. సంతోషింపగదమ్మ! ఆంధ్ర జననీ! ♦ సారస్వత స్నానవి
శ్రాంతిప్రీతుల, నీదుపుత్ర కుల, దీ ♦ క్షాబద్ధులఁజూచి ని
శింతన్ సోదరులార! భూజననిఁ బూ ♦ జింపుండు బ్రహ్మార్పణో
దంతవ్యక్తి మనోబలమ్మున దథా♦ స్తంచుఋషుల్ పల్క గన్