పుట:Jadakucchulu1925.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రమాత

శా. శ్రీ లింపొందగ యావదాంధ్ర జనమాతృక్ష్మాశాలీనూత్న తే
    జోలీలామృతమాని , దద్బలవదౌ ఉత్సుక్యంబున్ తావకో
    ద్వేల ప్రాక్తన కీర్తిగీతముల న ర్థింబాడు నీపుత్ర పు
   త్రీలోకమ్మున కేమిదెల్పెదవు సం• దేశంబు నాంధ్రావనీ!

శా. ఆశల్ కౌతుక పూర్ణ చంద్రికలుపూయన్ దుర్దినాచ్ఛాదమా
    కాశమ్ము విడిపోవ , నూతనకళో త్కర్షాప్తిమై మాతృ పూ
    జాశోభల్దయివారు నీశుభ దినో త్సాహంబునీక్షించి,నీ
    యాశీర్వాదములిమ్ముపుత్రు లకునంబా! యాంధ్రదేవీమణీ!

శా. తేటల్దేరెడు కాంతిపూరముల ను ఉద్దీపించు ముత్యాల ము
    ప్పేటల్ వోలె ద్వదీయకంఠమున శోభింఫుల్ నిగారించు, చే
    నాటక జీవనశోషణల్ గనని కృ ష్ణా గౌతమి భద్రలన్
    గాటంపుందమిఁ ద్రావువారమిదె కాంక్షా - క్షీరమాంధ్రావనీ!

శా. ఆ చాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది, శ్రీ కాకతి
    క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి, కృష్ణ ప్రాజ్య సామ్రాజ్య పీ
    ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోఁబుచ్చు,నీ
    ప్రాచీనాభ్యుదయమ్మునెన్నెదరు గర్వ స్ఫూర్తితల్లీ! సుతుల్

శా. ఉద్యన్మోహనమై,కుమారజన గర్వోద్రేకమై, యీత్రిలిం
    గోద్యానాప్తమధూదయమ్మగునవీనోత్సాహపున్ వేళ, నా

6