పుట:Jadakucchulu1925.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

జడకుచ్చులు

ఎంతసేపాయెరా యీవనాంతమున
నీకోసమొంటిగా ప్రాకులాడితిని,
ఎందెందు వెదకినా యీబృందయందు
నీవన్నెలే కానరావేల కృష్ణ!
* * * *
పొదలలో పూవు వై పోయినావేమో?
ఆలలో దూడవై యరిగినావేమో?
తమ్ములతీయగా ద్రవియించితేమొ?
కలికి వేణువుతోడ కరిగిసావేమొ?
* * * *
నిన్నెందుజూతురా చిన్నారికృష్ణ!
ఏమూల వెదికేదిరా మోహనాంగ!
* * * *
వెన్న దొంగిలి కానిపింపకున్నావొ?
చీర లెత్తుకపోయి దూరమైనావొ?
తరుణులే నిను దారి తప్పించినారొ?
మధురలో పౌరులే మఱపించినారొ?
* * * *
ఏమి సేయుదునురా నా ముద్దుకృష్ణ!
నినుజూడకేనింక నిలువజాలనుర