పుట:Jadakucchulu1925.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాధ పిలుపు

మూడునాళ్ళాయెరా మువ్వగోపాల
నినుజూడకేనింక నిలువజాలనురా!
* * * *
కనులలో మెదిలేవు కనకగోపాల
నీచక్కదనమెందు దాచుకోగలవు,
చాటుగా నిలుచుండి పాటబాడేవు,
మరుగున తలవంచి మాటలాడేవు,
ముసుగులో నేమిటో ముచ్చటాడేవు,
తెరలోను రాగాలు తీసెవు కృష్ణ!
* * * *
మురళివాయించరా వరహాలకృష్ణ!
నీజాడలను బట్టుకోఁజాలుదేను
గజ్జెలందెలుమ్రోయ కదపరాకాలు,
నీగుట్టుమట్టెల్ల నే నెఱుంగుదును,
* * * *
నెమిలికుచ్చుతురాయి నిగనిగలాడి
నిను బట్టియిచ్చునంచును తీసినావె?
నీచుట్టుపచ్చగా పూచేనటంచు
బంగారు శాలువాపారేసినావె?