పుట:JATHA.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత 48




ఆకాశంలో
ఒంటరి చుక్కనడుగు..
తోడు లేని వెలుగూ
చీకటే!

నిశ్శబ్దంగా ఉందా
శూన్యం?
మనసుతో విను
దాని మౌనగానం!

బరువున్నానని
ఎగరలేదా విమానం?
అనుకుంటే అందదా
ఆకాశం?

నెమ్మదే కానీ
నడకనాపిందా నత్త?
స్తబ్ధత
ఉనికికి ప్రమాదం!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/58&oldid=404227" నుండి వెలికితీశారు