పుట:JATHA.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47

నర్సింహారెడ్డి




ఎవరు
భూమ్యాకాశాలు వేరన్నారు?
చినుకులతో
కలుస్తూనే ఉన్నాయిగా...


ఉన్నతంగా
ఎలా ఎదగాలి?
మొక్కయిన
విత్తనాన్ని అడుగు!


అమ్మ అంటే
తెలీదట పిల్లాడికి..
వెళ్ళి
గూగుల్‌ నడిగాడు!


దాస్యానికి
వాడు విసిగిపోయాడు!
ఎత్తిన చేయి
కత్తికన్నా పదును!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/57&oldid=404284" నుండి వెలికితీశారు