పుట:JATHA.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత 46




మేం
అల్పసంతోషులం..
టీ తాగితే
అమృతం తాగినంత ఆనందం!

విష మొక్కలు
పెరిగిపోతున్నాయి!
ఉద్యోగాలకో?
ఊపిరి తీయడానికో?

ఆమె
ఇంకా చావలేదు!
ఎందుకంటే, ఆమె
నాటిన మొక్క బతికే ఉంది!

చెడ్డ వాళ్ళతో
తిరగకూడదు!
పడగనీడన
పవళించకూడదు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/56&oldid=404225" నుండి వెలికితీశారు