పుట:JATHA.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

నర్సింహారెడ్డి



జీవితం
చివరి మైలురాయి మరణం!
ముందలి
ప్రతీ మజిలీ ఓ పాఠం!


కడుపు కాకలేస్తే
చేతి కేంటట?
కలిపి మరీ
నోట్లో పెడుతుంది!


హృదయం
తపించి పోతుంది!
ఎందుకో మరి
కంటికి అంత బాధ?


రైతు కంటి నుండి
కన్నీరు కారింది!
చెరపడానికి
చినుకు రాలింది!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/53&oldid=404278" నుండి వెలికితీశారు