పుట:JATHA.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత 40



ఒక్కాకు కత్తిరిస్తే
చెట్టు చచ్చిపోదు..
ఒంటి కాలిపై
ఆధారం ప్రమాదం!

బంధం
ముడివేసిన దారం!
మనస్పర్థలు
విడదీసే కత్తెర్లు!

పూల కన్నా
నాకు పుస్తకాలిష్టం!
అక్షరాల పరిమళానికి
నేదాసోహం!

ఏ వూరు కేగినా
ఎందుకాలిడినా..
ఇంటర్నెట్‌ వస్తుందో లేదో
చూస్కోవాలి!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/50&oldid=403961" నుండి వెలికితీశారు