పుట:JATHA.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జత

24



రాలిపడె జీవాలు
కూలిపడె దేశాలు
ప్రగతి కొరోన పాలు
ఓ రాములమ్మ!


సభల నామం ప్రగతి
ఇంటి పేరూ ప్రగతి
కానరాదేం ప్రగతి?
ఓ రాములమ్మ!


అణుబాంబులేం లేవు
యుద్దాలు రాలేవు
చూపు మేరలొ చావు
ఓరాములమ్మ!

 
అసలు సిసలు రణమ్ము
ఎన్నికలే నిజమ్ము
చూపుము వేలి దమ్ము
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/34&oldid=404443" నుండి వెలికితీశారు