పుట:JATHA.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

నర్సింహారెడ్డి




దేశిపదముల బాట
తెలుగు తేనియ ఊట
తెలంగాణము పాట
ఓ రాములమ్మ!


పనికి రాని బండలు
తగిలి శిల్పి చేతులు
పలుకెన్నొ భావాలు
ఓ రాములమ్మ!


కనులకు కానరాని
దీనజన బాధల్ని
కాంచువాడెపో కవి
ఓరాములమ్మ!

 
నీళ్ళ నిండిన కడువ
నెత్తుకున్నొ క మగువ
కోసె మనసొక తడవ
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/23&oldid=404533" నుండి వెలికితీశారు