పుట:JATHA.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

12




పిడికిలెత్తిన నేల
నెత్తురొడ్డిన నేల
కూలబడె నియ్యాల
ఓ రాములమ్మ!


ఉత్తమ విద్యార్థులు
లోలోపల కోతులు
పైకి పాడు నీతులు
ఓ రాములమ్మ!


కను చూపులే గొలుసు
చేసి కట్టుట తెలుసు
అతివ లెరిగిన సైన్సు
ఓ రాములమ్మ!

 
రాయి రప్పల పూజ
చేయు భక్తితో ప్రజ
మనిషొ పగిలిన కూజ
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/22&oldid=404532" నుండి వెలికితీశారు