పుట:JATHA.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

8




పుట్టుక జత వచ్చెడు
మనతోడై చచ్చెడు
వాడు లేడు ఒక్కడు
ఓ రాములమ్మ!


ఒక దినము వయ్యారి
మరు దినమె గయ్యాళి
తాళి కట్టిన ఆళి
ఓ రాములమ్మ!


సగము చదివెడు వారు
సగము తెలిపెడు వారు
ఎందులొ పనికిరారు
ఓరాములమ్మ!

 
మనసు తెల్లని పూల
గుత్తి వంటిదె బాల
చేయ బూనకు మైల
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/18&oldid=404390" నుండి వెలికితీశారు