పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

35




1. ఇంద్రాణియొక్క చంద్రునివంటి ధవళ స్మితము నా బుద్ధికి వైర్మల్య మొసగి శ్రేష్ఠబలము నిచ్చుగాక.


2. శత్రునాశనమొనర్చి, భరత భూమిని మంచిదశకు తెచ్చి యింద్రాణి సంతోషపెట్టుగాక.


3. తన పాదములందు నమ్రులైనవారిని రక్షించు విధానమందు దీక్షబూనినది, జగత్తును భరింప సమర్ధురాలైనది యగు పరాశక్తి ప్రకాశించుచున్నది.


4. స్వర్గమం దెడతెరపిలేకను, ఆకాశరంగస్థలమందు సూక్ష్మము గాను గల ఆ యింద్రాణీశక్తి యధికముగాను, సూక్ష్మము గాను బ్రకాశించుచున్నది.

(స్వర్గమందు స్పష్టముగా నున్నందున తేజస్సధికము. ఆతేజము ఆకాశమందు తన సూక్ష్మత్వముచే తిరోధానమై యస్పష్టముగా నుండును.)


5. ఓ తల్లీ ! నీ యతిసూక్ష్మ తేజస్సు జగత్తునందు సకలానుభవములకు నిదానము (ఆధారము) అగుచున్నది.


6. ఓ తల్లీ ! అనుభవములయొక్క జ్ఞాన పరిణామమునకు నీ స్వరమే మూల మగుచున్నది. (ప్రణవ శబ్దము జ్ఞానమునకు నేతకనుక)


7. ఓ యీశ్వరీ ! ఏ స్వరము సమస్త జ్ఞానమునకు మూలమో, ఆ స్వరమే గతివిశేషమువలన కాలమగును గదా !