పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

265



24. ఓ కరుణామయీ ! వర్ణనాతీతములైన లక్షలకొలఁది గుణములు కలదానా ! భారతదేశ రక్షణార్ధ మీగీతములను రచించిన నరసింహసుతుడైన గణపతిని సమర్ధుని గావింపుము.


25. ఓ తల్లీ ! 'సులలితతామరస' వృత్తములచే సమాప్తము గావింప బడి, చెవులకింపగునట్లు నిబద్ధమైన యీ వరనుతిబంధమును నీవు పూర్తిగావిని నా యభిలాషను నెర వేర్పుము.


ఇట్లు,

శ్రీ భగవన్మహర్షి రమణాంతేవాసియు,

నరసింహ పుత్రుడును, కావ్యకంఠ బిరు

దాంకితుడును, వాసిష్ఠగోత్రనామకుడును

అగు గణపతిమునిచే విరచితమైన

ఇంద్రాణీ సప్తశతి సమాప్తము.

ఓం ఇంద్రాణ్యర్పణమస్తు.

________

జయంతి ప్రింటర్సు, కాకినాడ.