పుట:Hungary Viplavamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెలలలొ ఏం జరిగిందో జోసపుకి అర్ధమయేటంతమాత్రం ఆమెచెప్పేసింది.

'ప్రతిరోజూ గంటలకొద్దీ నొంటికాలుమీద నిలబడేదాన్ని" వొకనాడు కొడుకుతో అంతమాత్రమే చెప్పిందామె. ఈమాటలు మెల్లిగా అంటూవుంటే ఆమె మొహంమీద భయంనీడలు అలుముకున్నాయి. అప్పటి ఆదృశ్యం మరవరాంది, అదయిన కొద్దిదినాల్లోనే ఆమెచచ్చిపోయింది.

పదిహేనునిమిషాలు వొంటికాలుమీద నిలబడ ఛూశాడు జోసపుటాత్. తన త్ల్లంత లావాటివాడు తాను కాకపోయినా, త్వరలోనే అతడికి బాధకలిగింది. భరించలేకపోయాడు. తన తల్లి గంటలతరబడి ఎలా నిలబడిందో ఊహించలేక పోయాదు.

ఫార్మేను ఆఫీసునించి బైటికి వెళుతూ జోసపు తనమనసులోని భావం మనసులోనేవుందుకున్నాడు. ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళలో ఏవివొమనుమలెవరో ఆతదికి తెలియదు. అతడికేకాదు అవరికీ తెలియదు. అయితే వాళ్ళు వున్నా లేనిమాత్రంనిశ్చయంగా తెలుసు. కొద్దిరోరుల కిందటే తనతో పనిచేస్తూవున్న వొకడు ఇంకొకణ్ణిచూపిస్తూ "ఈదుష్టుడు తప్పకుండా రష్యా ఏజంటయివుంటాడు" అన్నాడు. ఈమాటకాస్తా అవరి చెవులోనో పడింది. వాణ్ణి ఎత్తుకుపోయారు. చచ్చేటట్టు కొట్తి మళ్ళీపనిలోకి పంపించారు.

అంతేకాదు, బుడాపేస్టు బైట జోసపుతల్లి గ్రామంలోనూ ఇలాంటిదే వొకటి జరగడం తెలుసు జోసపుకి. అక్కడ వొకడు పన్నులు బకాయి పడ్డాడు. దురదృష్టవశాత్తూ అతడు నొకస్నేహితుడితో అన్నాడు. "మాఅన్న అమెరికాలో వున్నాడు" అని.

ఎవళ్ళో ఎవివో వాళ్ళు ఈ మాట విన్నారు. "అయితే నీపన్నుల బాపతు డబ్బంతా అమెరికానుంచి ఆరువారాల్లో తెప్పించు" అన్నారు. పాపం, అతడు తెప్పించలేకపోయాడు. దాంతో అతణ్ణి ఎక్కడికో ఈడ్చుకుపోయారు. మళ్ళీ అతణ్ణి ఎవరూ ఛూడలేదు. అతడి సంగతి ఏమయిందో అనైనాఎవ్వరూ ఊహించలేదు. అదే అన్నింటికంటే చిత్రమైన విషయం. ఏమంటే ఏవివో వాళ్ళకి తెలిస్తే తంతారని వాళ్ళభయం. అంచేత అందరూ కిక్కురుమనకుండా వూరుకున్నారు.

ఒక పని బాగా చేసినంతమాత్రాన ఎవివో వాళ్ళు సంతోషించరు. వానికో ఉదాహరణ. హంగేరీ కమ్యూనిష్టులవంశం కాకపూర్వం, చదువుకున్న వొకడు ఇంజను ఫ్యాక్టరీలో పనిచేస్తూ వుండేవాడు. దురదృష్టవశాత్తూ వొక