పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవా విశ్వవిద్యాలయం-


కొంకణీ విశ్వకోశ్ స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి
పునర్విడుదల, పాఠ్యీకరణ


ప్రదేశం:తలయ్ గోవా, గోవా
సంస్థ: విద్యాసంస్థ

"కొంకణీ వికీపీడియా భవిష్యత్తు తరాల
కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంకణీ
భాషా వ్యవహర్తల కోసం విజ్ఞాన కోశంగా
వ్యవహరిస్తుంది. కొంకణి విశ్వకోశ్
చదవాలనిపించినప్పుడు అంతర్జాలంలోకి
వెళ్ళి, కొంకణి వికీ ప్రాజెక్టు తెరచి
అందుబాటులోకి స్వీకరించి చదవే ఆనందం
కోసం ఎదురుచూస్తున్నాను"
- సతీష్ షెత్యె, ఉపాధ్యక్షుడు, గోవా
విశ్వవిద్యాలయం

కొంకణీ విశ్వకోశ్ మొదటి పుట
గ్రంథకర్తలు మరియు గోవా విశ్వవిద్యాలయం సౌజన్యంతో

వివరణ:

కొంకణీ విశ్వకోశ్ అనేది గోవా విశ్వవిద్యాలయం 4 సంపుటాలుగా ప్రచురించిన కొంకణి భాషలోని విజ్ఞాన సర్వస్వం. కొంకణి విశ్వకోశ్ లో గోవా, కొంకణి, గోవన్ సంస్కృతి, జానపద సాహిత్యం, కళలు, చరిత్ర, భౌగోళిక స్థితిగతులు వంటివి సవివరంగానూ, ప్రపంచ సమాచారం క్లుప్తంగానూ ఉంది.కొంకణీ విశ్వకోశ్ ని గోవా విశ్వవిద్యాలయం స్వేచ్ఛానకలు హక్కుల్లో (సిసి బై ఎస్ ఎ 3.0) పునర్విడుదల చేసింది,

కొంకణీ విశ్వకోశ్ గ్రంథాన్ని పీడీఎఫ్ దస్త్రంగా స్కానింగ్ చేసి యూనీకోడ్ లో టైప్ చేసేందుకు స్వచ్ఛంద కార్యకర్తల కోసం పిలుపునిచ్చాము. విశ్వవిద్యాలయంలో ఈ లక్ష్యాల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది, తదితరులు డిజిటైజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. వారికి వికీ మార్కప్ కోడ్, తదితర నైపుణ్యాలు పెంపొందించేలా వర్క్ షాప్ నిర్వహించగా, పని విభజన చేసుకుని ప్రణాళికాబద్ధంగా కృషిచేసి కొంకణీ విశ్వకోశ్ పాఠ్యీకరణ పూర్తిచేశారు.

ధ్యాన్ పీఠ్ యొక్క సరస్వతి చిహ్నం, కొంకణీ విశ్వకోశ్ ద్వారా లభించిన అనేక చిత్రాల్లో ఒకటి, గ్రంథకర్తలు, గోవా విశ్వవిద్యాలయంల సౌజన్యంతో

ఫలితాలు, ప్రయోజనాలు:

  • కొంకణీ విశ్వకోశ్ స్వేచ్ఛానకలు హక్కుల్లో విడుదల చేయడం వల్ల అవసరమైన వారందరూ దాన్ని స్వేచ్ఛగా పంచుకుని, వినియోగించుకునే వీలు.
  • 4 సంపుటాల్లో, 3632కు మించి పేజీల్లోని కొంకణీ విశ్వకోశ్ యూనీకోడ్ లో డిజిటైజ్ అయింది.
  • 37మంది విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తదితరులు ఈ కృషి వల్ల వికీమీడియా ప్రాజెక్టులపై అనుభవం, ఆసక్తి మరింత పెంచుకున్నారు.
  • కొంకణీ విశ్వకోశ్ లోని వివిధ అంశాలకు చెందిన వ్యాసాలు కొంకణీ వికీపీడియా అభివృద్ధికీ, అంతర్జాలంలో కొంకణి భాషాభివృద్ధికీ సహాయపడతాయి.
  • కార్యక్రమానికి సంబంధించి ప్రసార మాధ్యమాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.