పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్


వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్
అంటే ఏమిటి?

అంతర్గత, బహిరంగ కార్యకలాపాల ద్వారా వికీమీడియా ఉద్యమానికీ, సంస్థకీ మధ్య దగ్గరి సంబంధాలు నిర్మించేందుకు ఆ సంస్థలో బాధ్యతలు స్వీకరించిన వికీమీడియా వాడుకరిని వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ అంటారు. వారు వికీమీడియా ప్రాజెక్టుల సమాచారం, నాణ్యత మెరుగుపరిచేందుకు పనిచేయవచ్చు, కానీ దానికన్నా ప్రధానంగా ఆతిథ్యమిచ్చిన సంస్థలో స్వేచ్ఛా విజ్ఞానం విషయంలో రాయబారిగా వ్యవహరిస్తారు. స్వేచ్ఛా విజ్ఞానంపై కృషిని వికీమీడియా ద్వారా ముందుకు తీసుకువెళ్ళదలచిన ఏ సంస్థ అయినా అది వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చేయవచ్చు.వారి కార్యకలాపాల్లో ఉండేవి:

  • వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధిని అవగాహన చేసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలను అంతర్గతంగానూ, బయటవారికీ నిర్వహించడం.
  • సంస్థ డిజిటల్ వనరులు వికీమీడియా కామన్స్ లో పంచుకోవడానికి మార్గాలు అన్వేషించడం.
  • సంస్థ సేకరణ, నైపుణ్యాలకు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యత కలిగినవాటిని గురించి వికీపీడియాలో వ్యాసాలు రాయడం, ఉన్న వ్యాసాలు విస్తరించడం వంటివాటి కోసం కార్యక్రమాలు నిర్వహించడం.
  • కార్యక్రమాలు, చర్చావేదికలు, కేస్ స్టడీలు, డాక్యుమెంటేషన్ వంటివాటి ద్వారా సిబ్బందితో పనిచేస్తూనే వారికి వికీపీడియా, సంబంధిత ప్రాజెక్టుల్లో పని ఎలా సాగుతుంది, వారు వాటిపై ఎలా కృషిచేయవచ్చు వంటి అంశాలు వివరించడం.
  • స్వేచ్ఛా విజ్ఞానాన్ని సమర్థించే ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం.

రెసిడెన్సీలు పనిచేసే కాలావధి, పద్ధతి వంటివాటిలో చాలా అనువుగా ఉంటారు, ఇవి జీతభత్యాలు తీసుకునేవిగా కానీ, లేకుండా స్వచ్ఛందంగా చేసేవిగా కానీ ఉంటూంటాయి. జీతభత్యాలిచ్చే ఉద్యోగాల్లో కొన్ని తక్కువ కాలావధి కలవి. తక్కువ సమయంలోనివైనా భవిష్యత్ అవసరాలకు ఉపకరించేలా వారు పనిచేస్తారు. కొన్ని ఉద్యోగాలు ఆరు నెలలు ఆంతకన్నా ఎక్కువ సమయం ఉండి రెండు వైపుల సంబంధాలు పెంపొందించేలా ఉంటాయి. మరికొన్ని స్వచ్చందంగా చేసే పద్ధతిలోనో, ఇంటెర్న్ షిప్ విధానంలోనో ఉంటాయి. మిగిలినవి పార్ట్ టైం లేదా పూర్తి కాలపు పనికి జీతం తీసుకునేవిగా ఉంటూంటాయి. వికీమీడియా ప్రాజెక్టులకు గణనీయమైన లాభం కలుగుతుందన్న నిర్ధారణకు వస్తే సీఐఎస్ ఎ2కె వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ ఉద్యోగాలకు నిధులు మంజూరుచేస్తుంది. గతంలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం చేపట్టినప్పుడు సీఐఎస్ ఎ2కె కూడా నిధుల మంజూరు చేసి కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఆ కార్యక్రమం ద్వారా వికీమీడియా కామన్స్ లోకి భారీ ఎత్తున విలువైన చిత్రాలు చేరడంతో పాటుగా, సంస్థలో స్వేచ్ఛా విజ్ఞానానికి అనుకూలంగా అంతర్గత విధాన మార్పులు జరిగాయి.వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ మీ సంస్థలో వాడుకరుల(వికీపీడియా రచయితలు)కు, చిత్రాలు చేర్చేవారికి శిక్షణ ఇవ్వడం, కార్యక్రమాలు సమన్వయం చేయడం, వికీపీడియాపై ఆసక్తిని పెంపొందించడం వంటివి చేయొచ్చు ఇంకా మీ సిబ్బందికి వికీపీడియాతో, వికీపీడియా సముదాయంతో మరింత బాగా కలసి పనిచేసేలా దోహదం చేయొచ్చు.భారతదేశంలో కాలికట్ వైద్యకళాశాలలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్రిటీష్ వస్తు సంగ్రహాలయం (లండన్, యుకె), హౌటన్ గ్రంథాలయం (యుఎస్ఎ), స్విస్ జాతీయ గ్రంథాలయం కెటలన్ నెట్వర్క్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ (స్పెయిన్), రాయల్ ఒంటారియో వస్తు సంగ్రహాలయ (కెనడా), స్టేట్ లైబ్రరీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా), ఆఫ్రికా సెంటర్ (దక్షిణాఫ్రికా) వంటి సంస్థల్లో కూడా వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ లు ఉన్నారు.

వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ వల్ల మీ సంస్థకు ఎలా లాభిస్తుందో తెలసుకోవాలంటే,
http://cis-india.org/contact-info వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు.