పుట:Himabindu by Adivi Bapiraju.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సిద్ధార్థినిక లోనికిపోయి అయిదు లిప్తలలో పరుగునవచ్చి హిమబిందునకు సువర్ణపాత్ర నొకటి అత్యంత మనోహర శిల్పవిన్యాసము కల దానిని తన తండ్రిగా రిమ్మనినారని చెప్పుచు సమర్పించినది. ఆ పనితనమునకు ఆ బాల ఎంతయో ముదమందినది.

వారందరు తమ స్యందన మారోహించి తమ భవనమునకు బోవుచుండ హిమబిందున కేమి తలంపు కలిగినదో, “అమ్మమ్మా, మహాచైత్యమునకు బోయి, ఆరాధన చేయవలె” నని యన్నది. ఆ మాటలకుముత్తవ ప్రతి అడకుండగనే సూతునకు రథము మహాచైత్యముకడకు పోనిమ్మని ఆజ్ఞ యిచ్చినది.

ఏ మథురభావఫలశ్రుతి నాశించి హిమబిందచ్చటకు పోగోరెనో అది అచ్చటనే ఆమెకు సిద్ధించి సువర్ణశ్రీ దర్శనమిచ్చినాడు. అది ఏమి విచిత్రమో తన కాతడు మోకరిల్లినాడు.


***

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 83 •