పుట:Himabindu by Adivi Bapiraju.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడివి బాపిరాజు జీవిత సువర్ణ రేఖలు


అక్టోబరు 8, 1895 : జననం (భీమవరం, ప.గో. జిల్లా)

1903 : ప్రాథమిక విద్య, కొవ్వూరు


జూన్ 5, 1915 : వివాహం, కూల్డ్రేగారి శిష్యత్వం ప్రారంభం

1917 : ఇంటర్

1920 : బి.ఎ., జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం

1921 : (సహాయ నిరాకరణోద్యమంలో) అరెస్టు, పుత్ర వియోగం.

1922 : సత్యాగ్రహం, అరెస్టు

1923 : చిత్రకళా విద్యార్థిగా ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోదకుమార ఛటోపాధ్యాయ శిష్యత్వం

1924 : “గయా కాంగ్రెస్”లో పాల్గొన్నారు

1931 : బి.ఎల్

1934 : ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన నవలా పోటీలో ‘నారాయణరావు’ నవలకు శ్రీ విశ్వనాథవారి “వేయి పడగలు”తో పాటు ప్రథమ బహుమతి

1935 : బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ పదవి

1936 : భార్య సుభద్రమ్మ గారికి అనారోగ్యం ప్రథమ పుత్రిక రాధా వసంత గారికి పోలియో

1949 : కుమార్తెలు రాధా వసంత, ప్రేమకుమారి గార్ల వివాహం.

1950 : కనకాభిషేకం; మద్రాసు తెలుగు భాషా సమితి ఆధ్వర్యాన తయారైన తెలుగు విజ్ఞాన సర్వస్వానికి, సాహిత్యం, భాష, కళలు, విద్య మొదలైన విషయాలకు సంబంధించిన సంపుటం తయారు చేసే ఉపసంఘంలో సభ్యత్వం.

1951 : సింహళంలోని సిగిరియా గుహల్లో గల కుడ్య చిత్రాల ప్రతిరూపాల చిత్రణకై పరిశీలన యాత్ర.

సెప్టెంబరు 22, 1952 : మరణం.

జననం:8-10-1895::మరణం:22-9-1952