పుట:Himabindu by Adivi Bapiraju.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిమాటలు నిజమో, నవ్వులో? బండ్లపందెమున నోడితినన్న కారణమున నన్ను నొప్పించుట కిట్లనుచున్నదా? లేక నిజముగా నాయెడ విరక్తయైనదా? తన యాశలన్నియు మఱదలిపై నిడికొని, తన కెన్నటికైన దేవేరియగు నన్న నిశ్చయముతో నుండ ఇట్లు విరసము లారంభించినదేమి? కానిమ్ము. ఈ బాల నీ మాత్రమునకే జుణిగిపోనిత్తునా అనుకొని “బిందూ! పుట్టనిబిడ్డకు పేరు లెందుకుగాని, ఈ యపురూప హారము నీకే తగును. దీనిని నీ కంఠమునకే అలంకరింతును” అని చెంతకేగెను.

హిమబిందు “వద్దు బావా! నా హారం నేనే వేసుకుంటాను” అని చేతులతో నందుకొనెను, సమదర్శ చిన్నబుచ్చుకోనెను. అతనికి దుఃఖమును, రోషమును నలముకొనెను.

తారాదత్త వచ్చి “అమ్మా! నాయనగారు వచ్చుచున్నారని నుడివి, సమదర్శిని చురుకుచూపుల చూచి, ఏమియు నెరగనట్లు వెనుకకుబోయెను.

రక్తచందన పాదరక్షలు చప్పుడుగా, చెక్కడపుబని లేని ఎఱ్ఱజువ్వి కఱ్ఱ కేల నూతగాగొని చారుగుపుడు వీరున్నమందిరమున కేతెంచెను. ఈ వారము దినములలో నాతడు విచారమున క్రుంగిపోయెను. అతని మొదటి యెత్తు భగ్నమైనది. కాని అంతటితో తా నూరకుండవలసినదేనా? మొన్న జయశీలుడగు నా బాలునియెదుట నాట్య మాడునప్పుడు, యువరాజగు శ్రీకృష్ణశాతవాహనుడు తదేకదృష్టితో హిమబిందు చూచినాడు. చక్రవర్తి కద్భుత మొనగూర్చు కార్యము లొకదాని వెనుకనొకటి తాను ఘటింపవలెను. తనవలన నెఱవేరు సమస్తకార్యములు నాత డెరుగవ. మొన్న తన వేగులవారు తెచ్చిన జాడనుబట్టి బ్రాహ్మణ బ్రహ్మచారి నొకని పట్టితెచ్చిరి. ఇంకను తన కావిషయమై ఎన్నియో సంగతులు తెలియవచ్చినవి. కానియీ సమదర్శి యేమిటి? పలుసారులు హిమబిందుకడ కీతడు రాజనదు. యువరాజ్యకంఠయోగ్య మగు నా రత్నహారమున కీత దరుడు కాడు. హిమబిందు మనస్సు ఏ దుర్ముహూర్తమునయిన నీ వెట్టి మేనల్లునిపై చనవుకొలది లగ్నమైనచో తన కలలన్నియు శకలము లగును. ఈ బాల్య స్నేహమును తెంచుటకే సమదర్శిని దేశాంతర గతుని గావించవలెను. చక్రవర్తి మనస్సును సంతోషపార్టీలో నోలలాడించగల కులపాలక కామందకములను యువరాజునకు బసదనమీయనెంచిన నవి యోడిపోయెను. కాని ఇంత మాత్రమున అధైర్యమేల? మహత్కార్యములు నెరవేర్ప వలయును, విధిని తన లెంకలలో నొకనిగాజేసి ఆంధ్రరాజ్యమును తన చేతులలో నాడించి, చక్రవర్తితో తాను వియ్యమందవలయును. తన యీ సంకల్పము అమోఘము.

చారుగుపుడు గదిలోనికి వచ్చినతోడనే హిమబిందు లేచి తండ్రి కడకు వచ్చి మోకరించి, నమస్కరించి, లేచి చేయిగొని సుఖాసనముపై నధివసింపచేసి యాయనప్రక్కనే తాను గూర్చుండెను. సమదర్శి మేనమామకు పాదాభివందన మాచరించి నిలువబడి యుండ, చారుగుపుడు చేయియూ పెను. అతడును తన పూర్వపీఠము పై నొరిగేను.

చారు: సమదర్శి! నీకా కామందక కులపాలకములు కావలయునేమోయని మాట పంపినారు. ప్రత్యుత్తరము పంపినావు కావేమి?

సమ: మామా! అట్టి మేటిగిత్తలు నీకడనే యుండవలయును.

హిమ: నీకడ నేల నుండకూడదు బావా?

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
.53.