పుట:Himabindu by Adivi Bapiraju.pdf/291

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

అమృతపాదులు తండ్రిముఖము గమనించెను. తనలో ఒక విశ్వాంభోధి మథన మగుచున్నది. ఆతడు తండ్రి ఎదుట పద్మాసనాసీనుడై, యోగాసనబద్దుడై నిర్వికల్ప సమాధిలోనికి పోయినాడు. అటు స్థాలతిష్యుడును సమాధిలోనికి పోయెను. రెండును నిర్వకల్పములే. నిర్వికల్పము రెండురూపుల. నెట్లుండును? అందు వారిరువురును లయమైరి. వారి ఆత్మలు రెండును ఒకటై, ఆ ఏక త్వము విశ్వమున లయమై, సర్వమును నిత్యమున లయమైనది. ఇరువురును ఒక్కసారి ప్రపంచమునకు దిగిరి. వారికి మాటలురావు. బుద్దుడు నిజము. శ్రీకృష్ణ భగవానుడు నిజము, శ్రీకృష్ణుని భక్తుడు వ్యాసుడు నిజము. బుద్దుని భక్తుడు ఆనందుడు నిజము. ఈ ఆలోచన వా రిరువురకు ఒక్కసారి తట్టినది. ల: భిక్షూ! నిర్వికల్పపథగాములమైన మే మేమి, నిర్వాణపథ గాము రగు మీ రేమి ఒక్కరమే! దిగువ మీదారి మీది, మాదారి మాది. విషకన్య అమృతకన్య యగును. ఆమెను శ్రీకృష్ణుడు వివాహమాడును. వారి వంశము మహాసామ్రాజ్యభారము వహించుగాక! అమృతం మహరీ! అనిత్య, అనాత్మ, నిర్వాణము లను ముఖ్య సూత్రము లేమి, అనిత్య, ప్రత్యగాత్మ బ్రహ్మసాయుజ్యమను ముఖ్య సూత్రము లేమి, రెండును ఒకటియ! ఆర్యధర్మమే వేదములు. ఆర్య ధర్మావతారమే బుద్దుడు. జనకరాజర్షికి బిమ్మట శ్రీకృష్ణావతారము, వేద వ్యాసుల పరిణతియే బుద్ధావతారము. స్థాల: ఈ విశ్వాతివిశ్వములో సూక్ష్మరూపమేగాని, స్థూలమైగాని, సత్యమై, నిత్యమై, సర్వాతీతమై, సర్వజ్ఞానపూర్ణమై, సర్వశక్తియుతమైన బ్రహ్మపదార్థము లేదు. విశ్వములో స్పర్శలు, భావములు, వికారములు పొందుచుండును. అందుండి మరియు గాఢమైనవి మనుష్యభావములై పరిణమించును. అవియే శరీరము లగును. అవి నశ్వరములేకాని వట్టి మాయకావు. అంతీయకాని మాయాచ్చాదితమైన బ్రహ్మము ప్రత్యగాత్మత్వ మందుట అసత్యమని బుద్దుడు ప్రవచించినాడు. ఆత్మభావమే సకలదుఃఖములకు హేతువందురు. బుద్దు డట్లు చెప్పినంతమాత్రమున పరమాత్మ అసత్యము కాదు. పరమాత్మ లేనిమాట సత్యమైనచో ఉన్నదన్న మాత్రమున అది యుండదు. మీ దారి ధర్మపరము, మా దారి ధర్మపరము. మీలో అనధికారులు బుద్దధాతువును నిక్షిప్త మొనర్చి, స్థూపమని, చైత్యమని దానిని పూజ లొనర్తురు. “బుద్ధం శరణం గచ్చామి” అందురు. మాలో అనధికారులు పూజలు, భక్తి, యోగము, యజ్ఞము, యాగము మొదలగునవి చేయుదురు. వీనితో నేమి పోనిమ్ము! ఉత్తమచరిత్రయే ఎల్లరకు శిరో ధార్యము. అమృత: ఆర్యా! ఈ దినములలో ఈ విశాలప్రపంచమున ఎన్ని ఆత్మ విచారణలు లుద్బవింపలేదు? సంజయవైపుత్రవాదులు ఆత్మ లేదందురు. విశ్వజ్ఞానము మానవున కెప్పుడు అలభ్య మందురు. అజితకేశ కంబళీమతస్థులు ఆత్మ లేదందురు. మనుష్యుడు చాతుర్భూతాత్మక మందురు. పూర్ణకాశ్యపులు ధర్మము వలదు, అధర్మమువలదు పాపపుణ్యములులేవు అందురు. మస్కరి గోశాలజులు, అజీవకులు కర్మలేదని, మనుష్యునికి అధికారము లేదని అందురు. అంతయు నియతమే అందురు. మహాజిన మతము నంతియకదా! ఆత్మ లున్నవని మహా వీరుడు బోధించెను. ప్రత్యగాత్మ చావుతో నంతము కాదనెను; పరకాయప్రవేశమున్నదనెను; పుణ్య పాపములు అడివి బాపిరాజు రచనలు - 2 • 281 • హిమబిందు (చారిత్రాత్మక నవల)