పుట:Himabindu by Adivi Bapiraju.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

“అటులనా! ఎంత విచిత్రము! ఎవ్వ రా బాలుడు?” “మన సువర్ణశ్రీ!” “సువర్ణశ్రీకుమారుడు! అతని నెవ్వరు ప్రేమింపరు? ఇది గాధాలోచనము సలుపవలసిన విషయము ఆచార్యదేవా!” “ఆలోచనమున కే మున్నది? సువర్ణశ్రీ మహాశిల్పి, భక్తుడు” సర్వశాస్త్రపారంగతుడు, వీరసింహము. చారుగుప్తదేవుడు ఆంధ్రమహా సామ్రాజ్యమునకుమూలము, సువర్ణశ్రీ శక్తి.” “అవును స్వామీ!” చక్రవర్తి వెడలిపోయెను. అమృతపాదులు ఆలోచనాధీనుడయ్యెను. స్థాలతిష్యులు సనాతన ధర్మతేజస్సు, అనారములైన మార్గముల వెంట మానవులు నడుచున్నప్పు డిట్టి మహోత్తమపురుషులుద్భవింతురు. సనాతనమార్గము ఒక రీతి నంది మానవాభ్యుదయమున కిసుమంతయు నుపకారిగాక, కర్కశమై మృత్యురూప మందినప్పుడు బుద్ధభగవానుని వంటి అవతారపురుషు లవతరింతురు. అవియు కర్కశమైనప్పుడు సనాత నత్వము, నూత్నపుష్టి చేకూర్చుకొని, ఆ అధునాతనత్వ వక్రగతిని ఖండించును. ఈ రెండుశక్తులిట్టు పోరాడుకొనుచు లోకమును ముందునకు నడిపించుకొని పోవుచుండును గాబోలు ననుకొనుచు అమృతపాదార్హతులు సమాధిలోనికి పోయెను. ఆయన మోము చంద్రకాంతివలే వెలిగిపోయెను. 1. సమవర్తి హృదయము సమవర్తి నాగబంధునికను చూచుటయేమి, యామెను ప్రేమించు టేమి! పొడుగరి, యుద్దకుశలత, ఆనందహృదయ, స్పష్ణసౌందర్యరేఖా సమన్విత, వీరవిక్రమోపేత! -

  • అందమైన యువతులు మూడుజాతులవారని సమవర్తి అనుకొనినాడు. ఒకజాతివారు పూవులప్రోవులు, వెన్నతో తేనెలు రంగరించినవారు! ఇంకొకజాతివారు వజ్రముల ప్రోవులు. మూడవజాతివారు తేనెలును, కరగించిన బంగారును కలియబోసి మూర్తించినవారు.

| మొదటి జాతివారు అతీఆర్ధహృదయులు. రెండవవారు కర్కశ హృదయులు. మూడవవారు సమహృదయులు. నాగబంధునిక మూడవజాతి బాలిక. ఆమె ఎంత గంభీరమగు చరిత్ర కలది! ఆమెయుద్దము అప్రతిమానము. తన్ను గోవర్ధనపర్వతము వలె రక్షించును. పార్థసారథివలె అఖండధైర్యమును సమకూర్చును. ముందునకు తన్ను విజయయానము చేయించును. | యుద్దము చేయునప్పుడు నాగబంధునిక బాలిక యన్న భావ మాతనికి కలుగునది కాదు. ఆమెకు గాయములు తగిలినవి. తనకునూ తగిలినవి. కాని భయంకర దావాగ్ని శిఖలవలె వారిరువురు సమముగ ముందుకు చొచ్చిపోవువారే.. వారిరువురి హృదయములు ఆనందమయములు. వారు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నట్లు ఒకరినొకరికి తెలియును. ఆమె వీరకుమారుడై తెల్లవారగట్లనే సమవర్తి శిబిరమునకు వచ్చునది. “ఈ బాలిక నెట్లు యుద్ధమున కనుమతించుట, తనతో తీసికొనిపోవుట?” అని అతడనుకొనును. ఈ మహావీరునితో భుజము భుజము కలిపి యుద్ధము చేయు భాగ్యము అడివి బాపిరాజు రచనలు - 2 హిమబిందు (చారి • 253 •