“అన్నా! కామసూత్రములకు నింత గంభీరవ్యాఖ్యానము లెప్పుడాలోచించు కొంటివి! ఇంక నా హృదయము దర్శింపుము. ఎద్దుబండి పందెముల నాటినుండి పందెమున రెండవవాడుగ వచ్చిన యా మహాపురుషుని యందు మనస్సు లగ్నమైనది. అది ప్రేమయన్న భావమే నా కుద్భవింప లేదు. ఆయన వెంటనే యుజ్జయినికి యుద్ధయాత్రకై వెడలిపోయెను అంతకన్న అంతకన్న ఆ వీరపురుషుని మూర్తి నా జీవితమంతయు ప్రసరించి నిండిపోయినది. అన్నా! ఆయన వినా నాకు ఇంకొకరి తలపేలేదు.”
“అదా తల్లీ! ధాన్యకటకమున అమ్మను తొందరచేసి, పాటలీ పుత్రమునకు పోవలెనని ఊదరకొట్టి, ఇక్కడకు లాగుకొనివచ్చితివి!”
“అవును. ఉజ్జయినిలో వారు విజయమందుదురని నా కెందులకో ధైర్యము. వారు ఇచ్చటకు వత్తురనియు ఊహించితిని!”
“ఏమియు లేదు. నేను నీ సైన్యమున అంగరక్షక ఉపచమూపతిగ జేరుదును. నాకు సమవర్తి సైన్యమున జేర మహా సైన్యాధ్యక్షుల అనుమతిని సంపాదింపుము.”
“అమ్మ ఏమనును? నాయన ఏమనుకొందరు?”
“అది వారి కేల తెలియవలెను? నేను పురుష వేషమున, వీర పురుషోచి తాలంకారముల నీతో ఇచ్చటకు, అచ్చటకు పోవుట నాయనగా రెరిగి ఊరకుండుటయు, అమ్మ నవ్వుచు ఒప్పుకోనుటయు నీవు ఎరుగవా?”
“చెల్లీ, నా ప్రేమయు, నీ ప్రేమయు ఫలరహితములే యగునో, ప్రేమ మహాశ్రుతిలో స్వరములే యగునో! అటులనే కానిమ్ము. ఏదీ సిద్ధ?”
“అది సార్వభౌముల మహాశిబిరమున రాజపుత్రికలతో నాడుకోన బోయినది.”
“అందుకా మన శిబిరము నిమ్మకు నీరువోసినట్లున్నది.”
2. ఎవ్వరీ వీరుడు?
సువర్ణశ్రీ తనవెంట నొకబాలవీరుని గొని స్వైత్రులవారి దర్శనము చేసికొని “మహాప్రభూ! ఈ బాలుడు మా బంధువు. ఈతడు శ్రీసమవర్తి సేనానుల కంగరక్షాధిపతిగ నుండ ఆజ్ఞ దయచేయ వేడుకొనుచున్నాను. అంగరక్షక శిక్షణ నంది, అంగరక్షకులలో ఇట్టివా డింకొక్కడు లేడని ప్రసిద్ధినందినాడు” అని మనవిచేసెను.
“సేనాధ్యక్షా! ఈ బాలకుడు సమవర్తి సైన్యాధ్యక్షులనే ఎన్నుకొనుటకు కారణ మేమి?”
“సమవర్తికి చురుకు పాలెక్కువ. నిర్భయముగ ముందుకు చొచ్చుకుపోవును. అట్టివానివెంట నుండుట కీ బాలుడు కోరుచున్నాడు.”
“కానిమ్ము. ఏది కారణమై నేమి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి యందు ఎక్కువ గౌరవము, ప్రీతియు కలుగును”
వెంటనే సర్వసైన్యాధ్యక్షులు సమవర్తికి కమ్మ లిఖించినారు. వారి ముద్ర ఆయన అంగరక్షకాధికారి అందు అచ్చువేసి, ఆ పత్రము సువర్ణ శ్రీకి అందిచ్చెను. సువర్ణశ్రీయు, ఆ బాలుడును సర్వసైన్యాధ్యక్షులకు వీర నమస్కారము లిడి సమవర్తి శిబిరమునకు బోయిరి.
సమవర్తి ఆవేళయందు మహాగోపురముకడ ప్రచండయుద్ధ మొనరించుచుండెనని వార్త తెలియవచ్చినది. వెంటనే ఆ బాలవీరుడు సువర్ణశ్రీ మోముచూచి, “అన్నా! నీవు నీ
అడివి బాపిరాజు రచనలు - 2
• 241 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)