పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

హేమలత

యందు తనధనమును గొంతవ్యయపఱచుచు సత్కీర్తి ధనుడైనందున హేమలత వారియింట నిరపాయముగ నుండెను. గాని పితృసమానుడయినందున తాత కారాగృహవాసి యగుటకును దనకు దల్లిదండ్రులు గాని సోదరులుగాని మఱియేయితరదిక్కుగాని లేనందునకును మనస్సున నెల్లప్పుడు నామెచింత నొందుచు జిక్కి శల్యమైయుండెను. ఆమెమారార్చుటకు శివప్రసాదు కుమారియగు చంద్రావతి యనేకప్రయత్నముల జేయుచు వచ్చెను. గాని యవియెల్ల వ్యర్థములయ్యెను. చంద్రావతిభర్త యప్పటికి రెండు సంవత్సరములక్రిందట దేశాంతరమఱిగి తిరిగిరానందున వ్యక్తురాలైన యామె మిగులదుఃఖభారముచేత నలిగియుండి, తనతో సమాన దుఃఖురాలగు హేమలత నూరార్పుచు నామెచే దానాశ్వాసింపబడుచు బ్రొద్దులు పుచ్చుచుండెను. కాలము సకలదుఃఖభారములను శమింప జేసెను. కాబట్టి క్రమక్రమముగ హేమలత, చంద్రావతి మధురభాషణములచే గొంతయూరట గల్గియుండెను. ఇట్లు కొన్నిమాసములు గడచెను. ఆనా డుదయమున శ్రావ్యతర మయిన హిందీపాటల బాడుచు ముష్టివాడు ప్రసాదుగారియింటికి రాగా హేమలత గానకళాప్రవేశము గలదగుటచే నా పాటలు విని ముష్టివానికి బెట్ట దోసెడు బియ్యము దెచ్చెను. హేమలతను బిచ్చగాడెందుచేతనో యాపాదమస్తకమును ఱెప్పవాల్పక జూడజొచ్చెను. బిచ్చగాని వికృత దృష్టికి జడిసి బియ్యము త్వరితముగ బెట్టి పాకలోనికి జని జంద్రావతికామాటజెప్పెను. విని చంద్రావతి వచ్చునప్పటికి బిచ్చగాడు మరలిపోయెను.

ఇది జరిగిన కొన్ని దినముల కొకనాఁడు హేమలత దీపములు పెట్టిన తరువాత మదనసింగును గూర్చి తలంచుకొని తత్సంయోగము లభించుట దుర్లభమని విచారము నొందుచుండగా శివప్రసాదొక సేవకుని వెంట