పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

95

నిశ్చయమే యైనను నేను దండెత్తనని వారితో దృఢముగ జెప్పుచు వారేమరిల్లి యుండునట్లు జేయుము. మహమ్మదు అలాయుద్దీను, అని యా యుత్తరము గోరాసింగు చదివినతోడనే రాజపుత్రులనేకు లాశ్చర్యకోపగ్నులైరి. అంతట భీమసింగు పాండురంగనాధుని జూచి “దీనికి నీవేమి చెప్పెదవు? నిజము చెప్పుము.” అని యడుగ బాండురంగనాధుడు నేను మీకుబదులు చెప్పను. మీయిష్టమొచ్చినట్లు చేయుడు, అని యుత్తరమిచ్చెను. అంతట లక్ష్మణసింగు సభ్యుల నుద్దేశించి, వసంతభట్టు మనతావున గడుటక్కరియైప్రవర్తించుటచే నతడు దుర్మార్గుడని యెవ్వరు నెరుగరు. నాపై గొందరు కుట్రల జేయుచున్నారనియు వారలను నాకప్పగింతురనియు జెప్పి నమ్మించి నన్ను నిన్న రాత్రినాడొంటిగ దోటకు దీసికొనిపోయి బండిలో నెక్కించి నన్నుఖైదీగ ఢిల్లీకిబట్టికొని పోవబ్రయత్నించెను. నేను తప్పించుకొన బ్రయత్నింప నాప్రాణములు గూడ నపహరింప జూచెను. నాబాగ్యవశమున మన చిదానందయోగియు మఱొకడు వచ్చి యాగోముఖ వ్యాఘ్రమును జంపి నాప్రాణసంరక్షణ మాచరించితిరి. యోగితోవచ్చి నాప్రాణము నిలిపిన మహాపురుషుడెవ్వడో యని పలుక మదనసింగు రాజపుత్ర మధ్యమునుండి సింహమువలె లేచి వచ్చి “దేవా! బ్రాహ్మణ వేషములో మిమ్ము రక్షించిన వాడను నేనే. మీరు నాకుబహుమానముగ నొసంగినఖడ్గరత్న మిదిగో అని సభాసదు లాశ్చర్యపడునట్లు కంఠమెత్తి పలికెను. భీమసింగామాటలు విని తనపీఠమునుండి లేచి యానంద మాపజాలక కుమారప్రాణరక్షణ మాచరించినందులకు మదనసింగు గౌగలించుకొని యనేక విధముల స్తోత్రము చేసెను. తన ప్రాణముల గాచిన మహాత్ముడు మదనసింగని తెలియ లక్ష్మణ సింగు దనకంఠమున వ్రేలాడుచున్న ముత్యముల హారముదీసి మెడనువైచి