పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

ఆనాఁటి రాత్రి కొలవుకూటమున దర్బారు జరిగెను. నానాభాగములనుండి ఖిల్లాదారులు, జమీందారులు, పౌజుదారులు వచ్చి చక్రవర్తికిఁ దమతమ యధికార గౌరవంబుల నుచిత రీతి నజీరులనర్పించి యర్హమర్యా దల నొందిరి. చక్రవర్తి వలన ననేక బిరుదములఁ బొందిన ఢిల్లీనగరవాసులగు మహమ్మదీయ ప్రభువులుఁ గూడ వచ్చి దర్బారు నలంకరించిరి. అంతట నాజరుజంగు వచ్చి యుచితాసనమున గూర్చుండెను. సభ పూర్ణమైన వెనుక చక్రవర్తి రాజపుత్రస్థాన దండయాత్రను గూర్చి తన యభిప్రాయమును బూర్ణముగ నెఱిఁగించి సైన్యములును, సేనానాయకులను యుద్ధసన్నద్ధులై యుండవలయునని యాజ్ఞ యొఁసగెను. అదివఱకెప్పుడును దర్బారులయందు నాజరుజంగు నతిగౌరవముతోఁ జూచి యాతని యాలోచన నడిగెడి చక్రవర్తి యాదిన మాతనివంకఁ జూడక, దర్బారు ముగిసెడువేళ కోపముతో మనలో ననేకులు రాజద్రోహులున్నారు. మాసొమ్ముదినుచు మాశత్రుపక్షమునఁ జేరి మాప్రాణముల దీయ గోరుచున్న వారీ సభలో ననేకులు గలరని పలుక సభాస్థలమెల్ల నిశ్శబ్దమయ్యెను. అచటఁ జేరిన సామంతు లందఱు నొకరిమొగమువంక నొకరుజూడ నారంభించిరి. అప్పుడు జరుగుతున్న కలవరపాటు నవలోకించిన చక్రవర్తి సభ నుద్దేశించి,

మీరందఱు నిట్లనుమాన మొందవలదు. మాకిట్టి యనుమానమునకు వెడ మొసఁగినవాడు మాకత్యంతాప్తుడని మేమిదివఱకెంచు కొనుచు వచ్చిన నాజరుజంగు. అతఁడు రాజపుత్రులతో జేరి మనపైఁ గుట్రలు జేయుచున్నాఁడఁట. అతని కుటుంబమునకు మేము సలిపిన మహోపకారమునకు