పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

హేమలత

గును నాజరుజంగును దప్పక పడుదురను పూర్ణవిశ్వాసముతో రహిమాను ఖానానంద మొందుచుండెను. చక్రవర్తి రాజపుత్రులపై దండెత్తుట కర్తవ్యమగునా కాదా యని తనలోఁ దానాలోచించు కొనుచు, రాజపుత్రుల దేశముపై దాడి వెళ్ళుదమా వద్దా? మదనసింగుతో దండయాత్ర లేదని చెప్పినాము. ఈ విషయమున మీ యభిప్రాయమేమి? అని యడిగిన రహిమానుఖాను యిట్లనియె.

మహాప్రభూ! రాజస్థాన దండయాత్ర మీరు మానవలదు. రాజపుత్రులు పైగాంభీర్యము గలవారేకాని నిజముగఁ బిఱికివారు. చిత్తూరు జయింపకున్నయెడల మహమ్మదీయులు రసపుత్రులను జయింపజాలరని ప్రజలకు మనపై గౌరవము తగ్గును. అని చెప్పఁగానే చక్రవర్తియు నది సరేయని “ఱేఁపురాత్రి దర్బారగును. అప్పుడు దండయాత్ర సంగతి నెల్లరకు దెలియజేయుదము. ఈరాత్రి ప్రొద్దువోయినది. మీరు రహస్యమును బయట పఱుపకుఁడు” అని చక్రవర్తి లేవఁగా రహిమానుఖానపుడు మరల మదనసింగుతో దేవరవారు యుద్ధమునకు రామనిజెప్పుట మిగుల లాభము. మనము దండెత్తిరామని వారనుకొనుచుండ నాకస్మికముగ వారిపైఁబడి యోడించ వచ్చుననెను.

పాదుషా పకపక నవ్వి శహాబాస్ మంచి యోచన చేసినావు. నీవంటి బుద్ధిమంతుఁడు మా రాజ్యములో నింకొకడులేఁడు. అని వజీరును వీడుకొలిపి రహిమానుఖాను వసంతభట్టును దీసికొనిపోయి వేఱువేఱుగ నిద్దఱికిని జెఱియొక రహస్యమును జెప్పిపుచ్చెను. ఖాను తనబసకుఁ బోవుచుండ మార్గమున గులందరు ఫకీరు మరల నగపడి యతనిని బలుకరించి నీపని నేఁను